Tuesday, November 26, 2024

TS: తీరొక్క రంగుల్లో కోటి బ‌తుక‌మ్మ‌ చీర‌లు రెడీ.. ఆడ‌ప‌డుచుల‌కు అంద‌జేయ‌నున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర్ రావు ఏటా కోట్ల వ్యయం ఉన్నప్పటికీ ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్ ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నెయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా సోదరిమణులకు భారీగా పంపిణీ చేయిస్తున్నారు. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

ఈ ఏడాది 340 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలు నెయిస్తున్నారు. 240 పైచిలుకు వెరైటీ డిజైనర్ లతో చీరలు తయారుచేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఒక కోటి 18 లక్షల చీరలు మహిళా సోదరిమణులకు పంపిణీ చేయడానికి టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో
తయారు చేయించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం, రాష్ట్ర అవతరణ తర్వాత ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైనలలో చీరలు పంపిణీ చేయ‌నున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement