Tuesday, November 26, 2024

ఎమ్మెల్యే కి సీఎం కేసీఆర్ వార్నింగ్ – ఇది క్ష‌మించ‌రాని నేరం

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ పై సీఎం కేసీఆర్ సీరియ‌స్ అయ్యారు. హోలీ పండుగ రోజు ఎమ్మెల్యే ర‌చ్చ చేసిన సంగ‌తి విదిత‌మే. త‌న అనుచ‌రుల‌కు మందుని నోట్లో పోస్తూ, డ్యాన్సులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేపై విమర్శలు చెలరేగాయి. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఇప్పటికే మీపై చాలా ఫిర్యాదులు వచ్చాయని మండిపడ్డారు. పార్టీ పరువు తీసే పనులు చేసేటట్టయితే… పార్టీ నుంచి వెళ్లి పోవాలని స్పష్టం చేశారు. ఇలా చేయడం క్షమించరాని నేరమని… మరోసారి ఇది రిపీట్ అయితే పార్టీ నుంచి సాగనంపుతానని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement