Saturday, November 23, 2024

కేసీఆర్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా సరే కాస్త సంచలనం గానే ఉంటుంది. రాజకీయాల్లో ఆయన వ్యవహరించే తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. రాజకీయంగా సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే ఆయన వ్యవహరించే తీరు మాత్రం చాలామందికి భిన్నంగా ఉంటుంది. తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. శుక్రవారం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా నే ఆస్పత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగులను పరామర్శించారు.

కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న వార్డుల్లో సీఎం కేసీఆర్ క‌లియ‌తిరిగారు. అయితే, పీపీఈ కిట్లు వేసుకోని కేసీఆర్… మాస్కుతో పాటు ఫేస్ షీల్డ్ ధరించారు. ఏమాత్రం అదురు లేదు బెదురు లేకుండా నేరుగా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా రోగులని పలకరించి వారికి మనోదైర్యానిచ్చారు. వైద్య సేవ‌లు ఎలా ఉన్నాయ‌ని రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సౌక‌ర్యాల‌పై సిబ్బంది వ‌ద్ద సీఎం ఆరా తీశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిని సంద‌ర్శించి, కరోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటించాలని సంకల్పించిన సీఎం ఇవాళ వరంగల్ ఎంజీఎంను సంద‌ర్శించారు. త‌ర్వాత వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ప‌రిశీలించ‌నున్నారు.

కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలును సందర్శించి, నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి కెప్టెన్‌ ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2 గంటలకు ఎంజీఎం దవాఖానకు వెళ్తారు. రోగులతో మాట్లాడడంతో పాటు దవాఖానలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

- Advertisement -

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్​ పీపీఈ కిట్​ లేకుండా ఆస్పత్రిలోని కొవిడ్​ బాధితుల వద్దకు వెళ్లడం తప్పని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే… సీఎం కేసీఆర్ వయసు దాదాపు 67 ఏళ్లు అయినా సరే ఆయన మాత్రం పిపిఈ లేకుండానే గాంధీ, ఎంజీఎం ఆసుపత్రుల్లో వెళ్లి అక్కడున్న రోగులతో దగ్గరగా మాట్లాడారు. కేవలం ఆయన మాస్క్ మాత్రమే ధరించారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసేవాళ్లు కూడా ఆయన వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement