తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిలో పర్యటించారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. హాస్పటల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న బాధితుల దగ్గరకు వెళ్లి సీఎం పరామర్శించారు. ICU లో చికిత్స పొందుతున్న పేషంట్ల ను పరామర్శిస్తూ…వారికి ధైర్యానిచ్చారు సీఎం కెసిఆర్. ఔట్ పేషెంట్ వార్డులో కరోనా చికిత్స పొందుతున్న…పేషంట్ల కు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.
కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.