ఆసియాలోనే అతిపెద్ద మేడారం మహాజాతరకు సీఎం కేసీఆర్ శుక్రవారం వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క–సారక్కలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి వెళ్తారు. కేసీఆర్ మేడారంలో సుమారు మూడు గంటలకుపైగా గడుపుతారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. సీఎం వెంట ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రానున్నారు.
మరోవైపు మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క- సారలమ్మల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహరాష్ట్రల తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.