తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్హాపూర్ బయలుదేరుతారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదైన కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు.
కాగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పిలుపు మేరకు గత నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమి ఏర్పాటు దిశగా ఆరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులతో చర్చలు జరిపారు.