ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 11న జనగామ పర్యటనకు వెళ్లనున్నారు. జనగామ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఈ నెల 11న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రజాప్రతినిధులతో రివ్యూ చేసి మధ్యాహ్నం 3 గంటలకు అదే ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రయాణం అవుతారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement