తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. మూడ్రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఆయన పర్యటిస్తారు. మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అవుతారు. నేషనల్ ఫ్రంట్ కోసం పలు ప్రాంతీయ పార్టీల మద్దతును కేసీఆర్ కూడగట్టనున్నారు. ఇందులోభాగంగానే పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశం అవుతానని, వివిధ అంశాలపై వారితో చర్చిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బీజేపీ ముక్త్ భారత్’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement