తెలంగాణలో ఉద్యోగ భర్తీ అంశానికి సంబంధించిన ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని అని అన్నారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ సమాజం నలిగిపోయిందన్నారు. ఆకలిచావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు ఉండేవని గుర్తు చేశారు. ఉద్యోగాలు రాలేదన్న బాధతో నిరుద్యోగులు తీవ్రవాదులైన సందర్భాలు చూశామన్నారు. తెలంగాణ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదని పిడికెడే మందితో తానే పోరాటం ప్రారంభించానని అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రం సాకారమైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగిందన్నారు. ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడేవాల్లు గతంలో ఏం చేశారో తెలుసన్నారు.
CM KCR: తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం.. ఉద్యోగాలు రాలేదన్న బాధతో తీవ్రవాదులైయ్యారు
Advertisement
తాజా వార్తలు
Advertisement