Friday, November 22, 2024

సీఎం కేసిఆర్ తీపి కబురు – మంత్రి పువ్వాడ హర్షం

ఖమ్మం బ్యూరో : పేదరిక నిర్మూలనలో భాగంగా డ్వాక్రా మహిళల సంఘాలకు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థలోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని సీఎం కేసిఆర్ చేసిన ప్రకటన పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో ఎన్నడూ లేనివిధంగా సెర్ఫ్‌ సొసైటీ ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు సీఎం కేసిఆర్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి అజయ్ పేర్కొన్నారు. అలాగే ఇందులో భాగంగా పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం కేసిఆర్ ప్రకటించడం సగటు సామాన్యుడి నాడి తెలిసిన సీఎం అని, ఆయనకు దార్శనికతకు ఇది ఓ ఉదాహరణ అని చెప్పారు.. మరోవైపు గత కొంత కాలంగా ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని సీఎం నిర్ణయాన్ని మంత్రి స్వాగతించారు. ఇప్పటి నుంచి సీఎం కేసిఆర్ చేసిన సూచనల పాటించి నిరసనలు చేయకుండా ఉండాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement