ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా కొల్లూరు పర్యటనలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు.
అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
- Advertisement -