దేశంలో ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఫసల్ బీమా యోజనతో రైతులకు లాభం చేకూరట్లేదని తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాపై కేసీఆర్ మండిపడ్డారు. ఫసల్ బీమా యోజనపై కేంద్రానికి సూచనలు పంపుతామని అన్నారు. కేంద్రాన్ని తాము విమర్శించడం.. వారు మమ్మల్ని విమర్శించడం సరికాదన్నారు. దేశానికి బాధ్యత వహిస్తున్న కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని తెలిపారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా శీతల గోదాములు నిర్మించాలని చెప్పారు. శీతల గోదాములు నిర్మించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంటుందన్నారు. ఆహార ధాన్యాల కొరతే ఏర్పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చని చెప్పారు. వరి ధాన్యం తాము కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం తెలిపారు.
ఇది కూడా చదవండి: కేంద్రం పైసా ఇవ్వలేదు: సీఎం కేసీఆర్