నల్గొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్‌లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రెండు ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్స్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పానగల్ రిజర్వాయర్‌ను ట్యాంక్‌బండ్, శిల్పకళాతోరణం ఏర్పాటుకు ప్రణాళికలు రూపకల్పన చేయాలని చెప్పారు. రూ.36కోట్లతో నూతన డిగ్రీ కాలేజీ భవనం నిర్మాణానికి గురువారం జీవో జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రోడ్ల వెడెల్పు, నూతన టౌన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు, పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న టౌన్ హాల్ నీటి పారుదల శాఖకు చెందిన ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఈ నెల 31న మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలను జిల్లా పర్యటనకు పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ఐటీహబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.110కోట్లతో ప్రభుత్వం ఐటీహబ్‌ను నెలకొల్పింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..