తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఎంజీఎంపీ ఆస్పత్రితోపాటు వరంగల్ సెంట్రల్ జైలను పరిశీలించారు. అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అంతకు ముందు.. కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వార్డులో పిపిఈ కిట్స్ లేకుండా కోవిడ్ వార్డులోకి వెళ్లిన కేసీఆర్.. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా ఇచ్చారు. ఎంజీఎం పర్యటన అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లారు. కెప్టెన్ లక్మికాంత రావు ఇంటిలో లంచ్ చేశారు. ఆ తరువాత వరంగల్ సెంట్రల్ జైలు చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత ఉత్పత్తులు, ఇతర వస్తువులను సీఎం పరిశీలించారు. అలాగే జైలు ప్రాంగణం గురించి అడిగి తెలుసుకున్నారు.