Tuesday, November 26, 2024

దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు.  సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ స‌మీక్షించారు. చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌  మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు అమలుపై చర్చిస్తున్నారు.

ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, గాదరి కిషోర్, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, హన్మంత్ షిండే, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఖమ్మం జడ్పీ ఛైర్ పర్సన్లు, సంబంధిత కలెక్టర్లు పాల్గొన్నారు.

దళిత బంధు పథకాన్ని ఇప్పటికే హుజురాబాద్ లో అమలు చేస్తున్నారు. పేద దళితులకు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వంద శాతం రాయతీతో అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తోంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాలను దళితబంధు కోసం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇది కూడా చదవండి: సీఎం జగన్ ను కలిసిన ఏపీ కొత్త సీఎస్

Advertisement

తాజా వార్తలు

Advertisement