Saturday, November 23, 2024

కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్.. హైదరాబాద్ చేరుకున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. 9 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని శంకుస్థాపన చేసేందుకు సెప్టెంబర్ 1న ఢిల్లీకి వెళ్లిన సీఎం.. పలు కార్యక్రమాల దృష్ట్యా తొమ్మిది రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ నెల 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం 3వ తేదీన ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారు. సుమారు 50నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్​.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు.

అనంతరం ఈ నెల 4న కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్​.. రాష్ట్రంలో కొత్త జిల్లాలో, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్​ అధికారులను కేటాయించాలని విన్నవించారు. ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్​ ని కలిసి.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం, కేంద్ర గెజిట్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీతో భేటీ అయిన కేసీఆర్.. జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. 7న తెలంగాణలో వరదల పరిస్థితిపై ఢిల్లీ నుంచి  అధికారులతో ఫోన్‌ ద్వారా సమీక్షించారు.  కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌ను కలువాలని భావించినప్పటికీ.. ఆయన అపాయింట్‌మెంట్‌ లభించలేదు.

ఇది కూడా చదవండి: లబ్ధిదారుల ఖాతాలో దళితబంధు నిధులు.. చెక్ చేసుకోండి!

Advertisement

తాజా వార్తలు

Advertisement