తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ కు చేరుకున్నారు. అక్కడ నిన్నటి నుంచి భగవద్రామానుజల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ రామానుజాచార్యలు 216 అడుగుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్ శ్రీ రామానుజాచార్యలు విగ్రహాన్ని సందర్శించి.. చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్ కు చేరుకుంటారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..