ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని పొలిటిషియన్ ఉండరేమో. ఆ పార్టీ, ఈ పార్టీ అనే ఏం లేదు. ఏపార్టీ అయినా ఆయన వన్స్ డిసైడ్ అయితే ఆ పార్టీ విజయం సాధించి తీరాల్సిందే. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం తెలంగాణలో గ్రౌండ్ రియాల్టీ కోసం సర్వే లు చేయిస్తోందట. కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ యాక్టివిటీ పై జనం ఏమనుకుంటున్నారో తేల్చే పనిలో పడ్డారు. కేంద్రం పై కాలు దువ్వుతున్న కేసీఆర్ పై జనం లో వున్న అభిప్రాయం ఏంటి కేసీఆర్ మాటలను ప్రజలు నమ్ముతున్నారా.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తాననడం పై జనంలో జరుగుతున్న చర్చ ఏంటి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. గత వారం నిర్వహించినరెండు బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్ చేసి మాట్లాడారు కేసీఆర్. కొత్త రాజ్యాంగం కావాల్సిందేనని కామెంట్ చేయటం కేంద్రం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు టీఆర్ ఎస్ నేతలు. కాగా ఇప్పటికే కేసీఆర్ యాక్టివిటీ అంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే జరుగుతుందనే ప్రచారం కూడా ఉంది.
ప్రశాంత్ కిషోర్ సర్వే చేస్తున్నారని మీడియా సమావేశంలో కూడా చెప్పారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ పొలిటికల్ వ్యూహాలపై జనం ఏమనుకుంటున్నారో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఫైట్, అసోం సిఎం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి బాసటగా నిలవడాన్ని ప్రజలు ఎలా తీసుకుంటున్నారు..? కేసీఆర్ నయా స్ట్రాటజీ జనాలకు అర్థమయ్యిందా..? అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతోందన్న దానిపై గులాబీ బాస్ సర్వే చేయిస్టున్నట్లు తెలుస్తోంది. 12 ప్రశ్నలతో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. టిఆర్ ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? బీజేపీ ని టార్గెట్ చెయ్యడాన్నీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పార్లమెంట్ లో మోడీ రాష్ట్ర విభజన పై మాట్లాడిన మాటలపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు..? తెలంగాణ సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంది..? ఇలాంటి అంశాలపై సర్వే చేసి ప్రశాంత్ కిషోర్ టీం కేసీఆర్ కు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరి జనం ఏమనుకుంటున్నారో..జనంలో కేసీఆర్ కి ఎంత ఆదరణ ఉందో ఈ సర్వేతో తెలియనుందన్నమాట.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..