గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు జరగలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు. శుక్రవారంగ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదన్నారు. కాంగ్రెస్ సభ్యుల మాటలు వింటే జాలేస్తోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని సర్పంచ్లు దేశంలోనే అత్యంత గౌరవంగా బతుకుతున్నారు. మన సర్పంచ్లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్లు బాధపడ్డారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నమన్నారు. కాంగ్రెస్ హయాంలో సర్పంచ్లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని, ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్ లు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ, పంచాయతీలకు నిధులు ఎక్కడా ఆపలేదన్నారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో ప్రతిపక్షాలకు తెలియదా? అని ప్రశ్నించారు. మన గ్రామాలను చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని తలిపారు.
ఇది కూడా చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..