Tuesday, November 26, 2024

ఊరికి ఒక పంచాయతీ.. గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం: సీఎం

గ్రామ పంచాయతీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జ‌రుగుతోంది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప‌ల్లె ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు. గత ప్రభుత్వాల హయంలో బడ్జెట్​ను ఎలా ఖర్చు పెట్టాలనేదానికి ప్రణాళికలు కూడా లేవని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా అంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామ పంచాయతీలు మురికికూపాలుగా ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా గ్రామపంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని ప్రకటించారు. అందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులతో గుర్తించిందని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం సమకూరేలా చేస్తున్నామన్నారు. గతంలో 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారని సీఎం చెప్పారు. ప్రతి ఊరికి ఒక పంచాయతీ కార్యదర్శిని ఉండేలా నియామకాలు చేపట్టినట్లు వివరించారు. గ‌తంలో పారిశుధ్య కార్మికుల‌కు స‌రిగా జీతాలు ఇచ్చేవారు కాదన్నారు. గ్రామ‌పంచాయ‌తీల‌కు చార్జ్‌డ్ అకౌంట్ ఏర్పాటు చేశామన్న సీఎం.. వ‌ర్క‌ర్ల‌కు ముందుగా జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: భట్టికి అవ‌గాహ‌న లోపం: ఆ నిధులు ఉండవన్న సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement