Saturday, November 23, 2024

మాస్క్ తీస్తే కరోనా దూరింది: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కరోనా పై పంచ్ లు వేశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాస్క్ ధరించడంపై చేసిన కామెంట్స్ ఆశక్తికరంగా మారాయి. తాను ఒక చోట పెళ్లికి పోతే ఆ పెళ్లి కొడుకు సర్‌ మాస్క్ తియండి అన్నాడు. మాస్క్ తియ్యడం ఎందుకయ్యా అంటే మీరు మాకు మళ్లీ ఎప్పుడు దొరుకుతారు సర్‌ ఫొటో తీసుకుంటాం అన్నారు. మాస్క్ తీస్తే నేను కరోనాకు దొరుకుతానేమో అన్నాను. వాడు లాగి వీడు లాగి నాకు కూడా ఎక్కడో కరోనా వచ్చిందని కేసీఆర్ నవ్వులు పూయించారు. కరోనా బారిన పడ్డా కూడా వెంటనే కోలుకున్న కేసీఆర్ ఇమ్యూనిటీ ని అంతా మెచ్చుకుంటున్నారు. ఇక అందరు మాస్క్‌ లు తప్పనిసరిగా వాడాలంటూ సూచించారు సీఎం కేసీఆర్. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో బాధ్యతతో ఉంటూ ఇతరులకు కూడా తమ వల్ల ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement