ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే, జ్వరం కారణంగా ఎయిర్ పోర్టుకు సీఎం వేళ్ల లేదు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు స్వాగత, వీడ్కోలు బాద్యతలు అప్పగించారు. ముచ్చింతల్ కు కూడా అవకాశం లేదని ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
గత కొంతకాలంగా మోదీ, కేసీఆర్ మధ్య గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేయడంపై సీఎం కేసీఆర్.. మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్.. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలకపోవడం ఇదే తొలిసారి. కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీ అయిన భారత్ బయోటెక్‌కు మోడీ చివరిసారిగా నవంబర్ 28, 2020న హైదరాబాద్‌ను సందర్శించారు. అయితే, ఆ సమయంలో ప్రధానిని స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి రావాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ముఖ్యమంత్రికి సమాచారం అందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మరికొందరు అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జగిరిన సందర్భంలో ఆ పర్యటన జరిగింది.