తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న ఆయన దేవెగౌడ నివాసానికి వెళ్లారు. ఆయనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించాలని ఆయన భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement