Tuesday, November 26, 2024

గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో సీఎం కేసీఆర్ భేటీ.. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై చర్చ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం కేంద్ర జ‌ల‌శక్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జ‌లాల పంపిణీపై 40 నిమిషాల పాటు చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాకు జ‌రుగుతున్న న‌ష్టం, కృష్ణా జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్రమంత్రిని కోరినట్లు సమాచారం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలు తేదీ వాయిదా అంశాన్ని మరోసారి షేకావత్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులను మాత్రమే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర‌మంత్రిని కేసీఆర్ కోరినట్లు సమాచారం.

కాగా , ఆదివారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement