Wednesday, November 20, 2024

మళ్లీ యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్ ?

కరోనా లక్షణాలతో హోం ఐసోలేషన్‌ లోనే చికిత్స తీసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మరోసారి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు రాత్రి సీఎంకు వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 21న యశోద హాస్పిటల్‌ లో సీటి స్కాన్‌ తో పాటు ఇతర టెస్ట్‌ లను సీఎం చేయించుకున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్‌ లో హోమ్ ఐసోలేషన్‌ లోనే చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కోవిడ్ నెగిటివ్ రాగానే రెండు రోజుల్లోనే కరోనాపై  సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరో మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌ డౌన్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ నెల 21 సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి వచ్చిన సీఎం కేసీఆర్‌ కు 6 రకాల వైద్య పరీక్షలు చేశారు వైద్యులు. సీ-రియాక్టివ్‌ ప్రొటిన్స్‌ (సీఆర్పీ), చెస్ట్ సీటి స్కాన్‌..డీడైమర్‌, ఇంటర్ ల్యుకిన్ (ఐల్‌-6), లివర్ ఫంక్షన్‌ టెస్‌(ఎల్‌.ఎఫ్‌.టి)కంప్లీట్‌ బ్లడ్ పిక్చర్‌(సీబీపీ) పరీక్షల చేశారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్‌ తిరిగి ఫామ్‌ హౌస్‌ కి వెళ్లారు.   సీఎం కేసీఆర్‌లో స్వల్ప లక్షణాలు కనిపించడంతో మొదట ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లుచేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్ధారించుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అందులోనూ పాజిటివ్ వచ్చింది. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement