Friday, November 22, 2024

కేసీఆర్ కేబినెట్ లోకి కొత్త మంత్రి.. ఈటల ప్లేస్ లో రీప్లేస్?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా టిఆర్ఎస్  ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తకెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, ఎంపీ బండ ప్రకాష్, పాడి కౌశిక్ రెడ్డిలకి ఎమ్మెల్సీ ఖరారు అయ్యారు. వీరిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్లేస్ ను కేసీఆర్ మళ్లీ రీప్లేస్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ ముదిరాజ్ కు కేబినెట్ లోకి స్థానం కల్పించి ఈటెల లోటును భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన తర్వాత జరిగిన రాజకీయ పరిణామల నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా పోటీ చేసి ఇటీవల ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మంత్రిగా నిర్వర్తించిన వైద్య ఆరోగ్య శాఖను ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కేటాయించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ పేరును కేబినెట్ లోకి తీసుకునేందుకు కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న బండ ప్రకాష్ పదవీకాలం మరో మూడున్నరేళ్లు ఉంది. రాష్ట్రంలోని ముదిరాజ్ సామాజిక వర్గం ఈటల వల్ల దూరం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ బండప్రకాష్ ను మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement