హైదరాబాద్ లో ఎయిర్ పోర్టు మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశ మెట్రో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గం మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు ఈ మెట్రో నిర్మాణం జరుగనుంది. 31 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ మెట్రో ఉంటుంది. 9మెట్రో స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేశారు. 29నిమిషాల్లో చేరుకునేలా మెట్రో నిర్మించనున్నారు. రూ.6250కోట్లతో మెట్రో ప్రాజెక్టు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్ వద్ద పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.