పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకోసం తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పుడదే బాటలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా నడుస్తున్నారు. ఆడపిల్లల పెళ్ళిళ్ల పథకాన్ని ప్రారంభించారు స్టాలిన్. దీనిలో భాగంగా బిడ్డ పెళ్ళి చేసే వధువు కుటుంబానికి ఆర్థిక సహాయమే కాదు ఎనిమిది గ్రాముల బంగారు కాసుని అందజేయనున్నారు. 94 వేల మందికి పైగా అమ్మాయిల వివాహానికి… ఏకంగా 750 కోట్లు కేటాయించింది తమిళనాడు సర్కారు. అలాగే రిటైర్డ్ పురోహితుల పింఛన్ పథకాన్ని కూడా ఆయన తాజాగా ప్రారంభించారు. గతంలో 3000 ఉన్న పురోహితుల పింఛను నాలుగు వేలకు పెంచారు. దీంతో తమిళనాడులో ఉన్న 1804 మంది పురోహితులు లబ్ధి పొందనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..