Tuesday, November 19, 2024

గోదావరికి వరద ఉద్ధృతి.. మందస్తు చర్యలకు సీఎం ఆదేశం

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిదులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, రెవెన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: టీ.సర్కార్ పై జగ్గారెడ్డి సంచలన కామెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement