గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందన్నారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్‌లో సైతం పంచాయితీ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారని గుర్తు చేశారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి గద్దెను ఎక్కించారన్నారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలన్న కేసీఆర్.. అందులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement