బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా, చాలా నీచంగా, చాలా దారుణంగా మాట్లాడుతున్నడు. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా? కేసీఆర్‌ని టచ్ చేసి చూడు.. బతికి బట్టకడతావా? నన్ను జైలుకు పంపిస్తవా నువ్? బలుపా.. అహంకారమా? ఏం కండ్లు నెత్తికెక్కినయా.. మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తాం. ఢిల్లీ బిజెపి వరి వేయెద్దని అంటోంది… ఇక్కడ సిల్లీ బిజెపి వరి వేయాలని చెప్తోంది. కేంద్రం వరి ధాన్యం కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి తెలంగాణ బిజెపి నేతలు లేఖ తేవాలి. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వరకు భాజపాను నిద్రపోనివ్వను” సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement