తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే ఇస్తుండగా.. మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు లక్ష 20వేల మందితో పాటుమరో 80వేల టీచర్ల కూడా నెలకు రూ.2,000, 25 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. మొత్తంగా 2 లక్షల మంది ప్రైవేట్ టీచర్లకు ఈ కరోనా కష్ట కాలంలో లబ్ధి చేకూరనుంది.