Tuesday, November 26, 2024

సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు..

క్రిస్మస్‌ను పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో రేపు (మంగళవారం) విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్‌ వైపున‌కు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు పోలీసులు. దీని ప్రకారం, బీజేఆర్‌ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. వాటిని నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మ‌ళ్లించ‌నున్న‌ట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుంచి వ‌చ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు కూడా అనుమతించరు. అటు వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్‌ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

CM KCR Greets Christians On Christmas | #INDTODAY - YouTube

అతిథులకు ఎంట్రీ , వారి వాహనాల పార్కింగ్‌..

  • గోల్డ్ కార్డ్ పాస్‌లను (ఏ-1 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘ఏ’ గేట్ వద్ద అంటే కేఎల్‌కే (ఖాన్ లతీఫ్ ఖాన్) భవనం ఎదురుగా దిగి, లోపలి గేట్ నంబర్ 17 ద్వారా ప్రవేశించి, ఆలియా మోడల్ స్కూల్, ఎస్‌సీఈఆర్‌టీ, అలియా కాలేజీలో తమ వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రీన్ కార్డ్ పాస్‌లు (ఏ-2 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘డీ’ గేట్ వద్ద దిగాలి అంటే ఎదురుగా. అలియా మోడల్ స్కూల్, బీజేఆర్‌ విగ్రహం దగ్గర, ఎస్‌ఏటీఎస్‌ గేట్ ద్వారా ప్రవేశించి వారి వాహనాలను అలియా కళాశాల, మహబూబ్ కళాశాల, అలియా మోడల్ స్కూల్, ఎస్‌సీఈఆర్‌టీ వద్ద పార్క్ చేయాలి.

బ్లూ కార్డ్ పాస్‌లు (బి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ఆయాకార్ భవన్‌కు ఎదురుగా ఉన్న ‘జి’ గేట్ వద్ద దిగి, లోపలి గేట్ నంబర్ 15 ద్వారా ప్రవేశించి, పబ్లిక్ గార్డెన్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలి.

పింక్ కార్డ్ పాస్‌లు (సి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు బిజెఆర్ విగ్రహం సమీపంలోని ‘ఎఫ్, ఎఫ్1’ గేట్ల వద్ద దిగి, లోపలి గేట్ నెం. 6 & 8 ద్వారా ప్రవేశించి, నిజాం కళాశాల మైదానంలో తమ వాహనాలను పార్క్ చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement