సీఎం కేసీఆర్ ఈనెల 9వతేదీన మెట్రో ఫేజ్-2 కు భూమిపూజ చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2పై ప్రీబిడ్ హెచ్ ఏ ఎం ఎల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ భేటీకి పలు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలు హాజరయ్యాయి. ఇందులో భాగంగా రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణంపై చర్చ జరుగుతోంది. మెట్రో రైల్ ఫేజ్-2 పై ప్రభుత్వ విధివిధానాలను హెచ్ ఏ ఎం ఎల్ తెలపనుంది. అదేవిధంగా ప్రాజెక్టు నాణ్యత, టైం బాండ్ పై నిర్దేశం చేయనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ వరకు బిడ్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 20న అర్హత కలిగిన కన్సలెన్సీ సంస్థల జాబితా ప్రకటించనున్నారు. 23న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ డాక్యుమెంట్ విడుదల కానుంది. సందేహాలను తెలిపేందుకు జనవరి 2 వరకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement