Tuesday, November 19, 2024

ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు వర్తింపు!

రైతుబంధు తరహాలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న దళిత సోదరులకు కూడా దళితబంధు వర్తింస్తుందని ప్రకటించారు. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. హుజురాబాద్ లో ప్రారంభించిన రైతు బంధు కార్య‌క్ర‌మం బ్ర‌హ్మాండంగా కొనసాగుతోందన్నారు. సామాజిక వివ‌క్ష నుంచి ద‌ళిత స‌మాజం శాశ్వ‌తంగా విముక్తి పొందటానికి మరో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలంగాణ సాధ‌న‌లో తొలిసింహ గ‌ర్జ‌న నుంచి నేటి వ‌ర‌కు కూడా సెంటిమెంట్‌గా విజ‌యం చేకూరే వేదిక‌గా కరీంనగర్ జిల్లా మారిందన్నారు.

ద‌ళితబంధు ఇది ఒక ప్ర‌భుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక మ‌హా ఉద్య‌మం అని సీఎం అన్నారు. ఈ ఉద్య‌మం క‌చ్చితంగా విజ‌యం సాధించి తీరుతుందన్నారు. గ‌తంలో తాను తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవని, ప్రజల దీవ‌నెలతో రాష్ట్రం న‌లుమూలుల ఉద్య‌మం ఉవ్వెత్తున చెల‌రేగి త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రెండు నెలల్లోనే అందరికీ దళిత బంధు అందుతుందని సీఎం తెలిపారు. దళిత బంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. తెలంగాణలో 17 లక్షలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నాయని చెప్పారు.రైతు బంధు తరహాలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళలవారీగా దళితబంధును అమలు చేస్తామన్నారు. దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement