Friday, November 22, 2024

పోలవరం పర్యటనకు సీఎం జగన్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి బ్యాక్ వాటర్ ప్రభావం, ముంపు గ్రామాలు, నిర్వాసితుల అంశంపై ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనన్నట్టు సమాచారం. సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​తో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ పోలవరానికి వెళ్లారు.

మరోవైపు వర్షాల సీజన్ ప్రారంభం కావటంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 27 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో కాఫర్ డ్యామ్ ఎగువన ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించే పనులు జరుగుతున్నాయి.

ఇదిఇలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా వడివడిగా పనులు సాగుతున్నాయి. కీలకమైన వరద నీరు మళ్లింపు ఇప్పటికే ప్రారంభించారు. డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన 42.5 మీటర్ల ఎత్తులో తలపెట్టిన కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement