ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న ఒంగోలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు నవరత్నాల్లో భాగంగా సున్నావడ్డీ పథకం కింద మూడో ఏడాది డ్వాక్రా మహిళల ఖాతాలకు నగదు విడుదల చేయనున్నారు. సీఎం పాల్గొనే కార్యక్రమం, పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అలాగే గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారైలు ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీని కూడా ప్రారంభించే అవకాశముంది. బాలినేనికి కీలక పదవి విషయాన్ని ముఖ్యమంత్రి ఆ రోజు వెల్లడిస్తారని సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement