Tuesday, November 26, 2024

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కొత్త సంవత్సరం ఇవాళ్టి నుంచే ప్రారంభం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దేవుని దయతో పుష్కలంగా నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగునాట వ్యవసాయపనులు ఉగాది నుంచే ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ సాగునీరు, తాగునీరుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని తెలిపారు.

శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు కలగాలని..సమృద్ధిగా వర్షాలు కురవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రంలో అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని, ప్ర‌తి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల‌తో నిండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement