Tuesday, November 12, 2024

PM Modi | సొంత ఎమ్మెల్యేలపై నమ్మకం లేని సీఎంని ఇక్కడే చూస్తున్నా.. అశోక్​ గెహ్లోట్​పై మోదీ ఫైర్​

ప్రధాని మోదీ ఇవ్వాల రాజస్థాన్​ పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్​ సీఎంకు తన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని, ఇట్లాంటి నమ్మకం లేని ముఖ్యమంత్రిని తాను తొలిసారిగా చూస్తున్నానని దుమ్మెత్తిపోశారు. మౌంట్​ అబూలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లోట్​, కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​ మధ్య రాజకీయ వైరం నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ముఖ్యమంత్రికి తన ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని తాను తొలిసారిగా చూస్తున్నానని అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వాల (బుధవారం) దుమ్మెత్తి పోశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి గెహ్లాట్‌, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మధ్య రాజకీయ వైరం నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన దాడిని ఉధృతం చేస్తూ.. ఐదేళ్లుగా రాష్ట్రం చాలా దారుణమైన పతనాన్ని చూసిందని, అభివృద్ధి లేదని ప్రధాని అన్నారు. ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వంపై కూడా ప్రధాని దాడి చేశారు. 2008 జైపూర్ వరుస పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.

రాజస్థాన్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడానికి భయపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. COVID-19 సమయంలో ప్రజలు చనిపోతున్నా పట్టించుకోలేదని మోదీ కాంగ్రెస్​పై వివమర్శల దాడి పెంచారు.

- Advertisement -

ఇక.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిచోటా అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల జోలికి పోవద్దని రాష్ట్ర ప్రజలను కోరారు. వైద్య రంగంలో అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ.. తొమ్మిదేళ్లలో దేశ వ్యాప్తంగా ఆరోగ్య స‌దుపాయాల విష‌యంలో తీవ్ర మార్పు వ‌చ్చింద‌న్నారు. ఆయుష్మాన్ యోజన దీనికి పెద్దపీట వేసిందని, ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు అందుబాటులో ఉన్నాయన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement