Friday, November 22, 2024

PUSHPA: త‌గ్గేదే లే.. ప‌రీక్ష రాసేదేలే: పదో తరగతి విద్యార్థి నిర్వాకం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎలాంటి సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప ది రైజ్’మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ను సంపాదించుకుని రూ.365 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. చిన్న పిల్లలు కూడా ఆ డైలాగ్ ని చెప్పడం మొదలు పెట్టారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ప్ర‌భావంతో స్కూల్లో చదివే పిల్లలపై కూడా పడింది. ఏకంగా పరీక్షల్లో అన్సర్ పీట్ పై తగ్గేదే లే అంటూ రాశాడు.

ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రిగాయి. కోల్‌కతాకు చెందిన 10వ తరగతి విద్యార్థి తన సమాధాన పత్రంలో పుష్ప డైలాగ్‌ను రాయడంతో పుష్ప చిత్రంపై ఉన్న క్రేజ్ తెలియజేస్తుంది. విద్యార్థి చేసిన ప‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కోల్‌క‌త్తాకు చెందిన ఓ విద్యార్థి త‌న టెన్త్ క్లాస్ పేప‌ర్ల‌ను పుష్ప ది రైజ్ సినిమాలోని డైలాగ్స్‌తో నింపేశాడు. పుష్ప‌, పుష్ప రాజ్‌.. అనే డైలాగ్స్‌తోపాటు త‌గ్గేదే లే అనే డైలాగ్ త‌ర‌హాలో ప‌రీక్ష రాసేదేలే(‘అపున్ లిఖేగా నహీ’) అని రాశాడు. ప్రస్తుతం ఆ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement