Monday, November 25, 2024

India | ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. సీజేఐ నిర్ణయాన్ని అభినందించిన ప్రధాని

సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నిర్ణయాన్ని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు. ఇటీవల ఒక కార్యక్రమంలో CJI జస్టిస్ DY చంద్రచూడ్ ప్రాంతీయ భాషలలో సుప్రీంకోర్టు తీర్పులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయవలసిన అవసరాన్ని గురించి మాట్లాడారని, సాంకేతికతను ఉపయోగించాలని కూడా సూచించారని ప్రధాని అన్నారు.

ఇది చాలా మందికి సహాయపడే ఒక మంచి ఆలోచన అని, ముఖ్యంగా యువకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని మోడీ ట్విట్టర్‌లో రాశారు. ముంబైలో బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా నిర్వహించిన కార్యక్రమంలో CJI ప్రసంగానికి చెందిన క్లిప్‌ను కూడా షేర్​ చేశారు.

న్యాయపరమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం  ద్వారా సామాన్యులకు మరింత ఉపయోగంగా ఉంటుందని ప్రధాని గతంలో తరచుగా చెప్పేవారు. ‘‘దేశంలో అనేక భాషలున్నాయి, ఇవి మన సాంస్కృతిక చైతన్యానికి తోడ్పడతాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి సబ్జెక్టులను మాతృ భాషలో (మాతృభాష) అభ్యసించే అవకాశం ఇవ్వడంతో పాటు భారతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది’’ అని మోదీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement