ఇవాళ చాలామందికి కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి, కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎంత తీవ్రత ఉందో తెలుసుకోవడానికి సిటీ స్కాన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి CORADS, రెండు CT severity index
CORADS
ఇందులో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి. CORADS అనేది సిటీ స్కాన్ ప్రకారం కరోనా ఉండే అవకాశాలు ఎంత అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది. అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉందని మాత్రమే చెబుతుంది. స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు.
CORADS 1: ఏమీ ఇబ్బంది లేదు
CORADS 2: సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు
CORADS 3: సిటీ స్కాన్‌లో కొంచెం తేడా ఉన్నా లేదా నిమ్ము లక్షణాలు ఉన్నా కానీ కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని తెలియడం లేదు.
CORADS 4: సిటీ స్కాన్‌లో కనిపిస్తున్న చాలా లక్షణాలు కరోనా అని చెప్పడం
CORADS 5: ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది
CORADS 6: సిటీ స్కాన్‌లో నిమ్ము లక్షణాలు కనిపిస్తూ RTPCR లేక ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులో పాజిటివ్ ఉంటే అది stage 6 అవుతుంది.
CT severity index
మనకు రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. ఒకటి కుడిపక్క, రెండోది ఎడమ పక్క ఉంటాయి. కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు (మూడు భాగాలు) ఉంటాయి. అంటే మూడుగా విభజించబడి ఉంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండు గా విభజించబడి ఉంటుంది. మొత్తం రెండు ఊపిరితితతుల్లో మనకు 5 భాగాలుగా ఉంటాయి. ఈ సిటీ సివియారిటి ఇండెక్స్ ( CT severity index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది .అంటే ఒక్కొక్క లోబ్ లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5… మొత్తం పాయింట్లు 25 అవుతుంది.
జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి.
0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు
1: 5% కన్నా తక్కువ గా ఉంది
2: 5 – 25 పర్సెంట్
3: 25-50 శాతం
4: 50-75 శాతం
5: 75 శాతం కన్నా ఎక్కువగా దెబ్బతింది
ఒక్కొక్క లోబ్‌లో జీరో నుంచి ఐదు స్టేజీ వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది.
ఈ స్కోర్ 8 కన్నా తక్కువ అయితే mild ( తక్కువగా ఉంది), 8 నుంచి 15 అయితే Modarate (ఒక మోస్తరుగా)
15 కన్నా ఎక్కువ అయితే Severe (ఎక్కువగా) ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నట్లు అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది.
సిటీ స్కాన్ కాకుండా మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయో మనమే స్వయంగా పల్స్ ఆక్సిమీటర్‌తో చెక్ చేసుకోవచ్చు. ఈ పల్స్ ఆక్సిమీటర్‌లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి. 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం. కాగా సిటీ స్కాన్‌పై పూర్తి అవగాహన కావాలంటే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.