పంజాబ్ కి చెందిన యువతి ఢిల్లీలోని మెట్రోస్టేషన్ పై నుండి దూకింది. అయితే సీఐఎస్ ఎఫ్ అధికారులకు ..ఇతర ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో ఆ యువతికి ప్రాణాపాయం తప్పింది. అధికారు వెంటనే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కిందికి దిగి రావాలంటూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి మాటలను పట్టించుకోని యువతి ఒక్కసారిగా కిందికి దూకేసింది.
కిందనున్న కొందరు సిబ్బంది ఓ దుప్పటిని గట్టిగా పట్టుకుని యువతి అందులో పడేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఆమె పడిన వేగానికి నేలకు బలంగా తాకడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సీఐఎస్ఎఫ్.. వేగంగా, తెలివిగా స్పందించి యువతి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు.
ఆత్మహత్యకి పాల్పడిన -యువతిని కాపాడిన సీఐఎస్ ఎఫ్ అధికారులు
Advertisement
తాజా వార్తలు
Advertisement