Saturday, November 23, 2024

సినీ ప్రియుల‌కు షాక్..థియేట‌ర్స్ లో పార్కింగ్ ఫీజు..

షాపింగ్ మాల్స్..ప‌లు చోట్ల పార్కింగ్ ఫీజులు వ‌సూలు చేస్తుంటారు. అయితే సినిమా థియేట‌ర్స్ లో పార్కింగ్ ఫీజు లేదు. కానీ మ‌ళ్ళీ థియేట‌ర్స్ లో పార్కింగ్ ఫీజు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ‌ ప్ర‌భుత్వం. థియేటర్ లు పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా చూసేందుకు వచ్చే వాళ్లే కాకుండా బయటివాళ్లు కూడా వచ్చి పార్కింగ్ చేస్తున్నారని థియేటర్ యాజాన్యాలు ప్రభుత్వానికి తెలిపింది. అంతే కాకుండా ఆ వాహనాల భద్రత తమకు సవాల్ గా మారింద‌ని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే అనుమతి ఇచ్చింది. ఇక ఈ నిర్ణయం తో సినిమా లవర్స్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి నుండి మళ్లీ సినిమా టికెట్ తో పాటు పార్కింగ్ ఫీజు కింద బైకు కు రూ. 20, పెద్ద వాహనాలకు అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement