Saturday, November 23, 2024

Ticket Price: తెలంగాణలో పెరిగిన సినిమా టికెట్ ధరలు.. కొత్త రేట్లు ఇవే..

ఏపీలో సినిమా టికెట్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంతో థియేటర్లు మూతపడుతున్నాయి. అయితే, సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. సినీ నిర్మాతలు, థియేటర్ల యజమానులు చేసిన వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ధరల పెంపుపై అధికారులు పంపిన ప్రతిపాదనలను సైతం తెలంగాణ ప్రభుత్వం అమోదించింది.

ఈ ప్రతిపాదనలో నగరాల్లో టికెట్​ ధరలు ఎంత ఉండాలి? పట్టణాల్లో ఎంత ఉండాలి? టౌన్లలో ఎంత ఉండాలి? అనేది నిర్ణయించారు. దీనితో పాటు ఏసీ థియేటర్లలో ధరలు ఎలా ఉండాలి? మల్టీ ప్లెక్స్​లలో ధరలు ఎలా ఉండాలి? అనేది కూడా ఖరారు చేశారు.

పెంచిన కొత్త టికెట్ ధరలు ఇలా..

నాన్​ ఏసీ థియేటర్లలో టికెట్ ధర కనీసం రూ.30కి పెంచగా.. గరిష్ఠ ధర రూ.70గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.50గా ఉంచగా.. గరిష్ఠ టికెట్ ధర రూ.150కి పెంచారు. జీఎస్​టీ కూడా వర్తిస్తుంది. మల్టీప్లెక్స్​లో టికెట్ ధర కనీసం రూ.100గా ఫిక్స్ చేశారు. గరిష్ఠ ధర రూ.250గా ఉంచారు. దీనికి జీఎస్​టీ అదనంగా వసూలు చేయొచ్చు. ఇక రిక్లైనర్​ సీట్ల ధరలను సింగిల్​ థియేటర్లలో అయితే.. రూ.200లకు, మల్టీ ప్లేక్స్​లో అయితే రూ.300కు పెంచారు. దీనికి జీఎస్​టీ అదనం. వీటితో పాటు నిర్వహణ ఛార్జీల కింద నాన్​ ఎసీ థియేటర్లు రూ.3, ఏసీ థియేటర్లు రూ.5 వసూలు చేసుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement