ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో వాట్సాప్‌లో చాటింగ్ చేశారు. తాము దర్యాప్తులో భాగంగా రఘురామ సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ తెలిపింది. ఈ మేరకు సీఐడీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వాట్సాప్ చాటింగ్ విషయాన్ని పేర్కొన్నారు.
కాగా చంద్రబాబు డైరెక్షన్‌లోనే సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానంలో రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసినట్లు వాట్సాప్ సంభాషణలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. పిటిషన్ ఎలా వేయాలి? అందులో ఏ అంశాలు ఉండా లి? లాంటివన్నీ చంద్రబాబు సూచనల మేరకే జరిగాయని చెప్తోంది. ఆ పిటిషన్ కాపీని చంద్రబాబు స్వయంగా చూసి తన న్యాయ సలహాదారులతో చర్చించి ఆమోదించిన తరువాతే న్యాయస్థానంలో రఘురామకృష్ణంరాజు దాన్ని దాఖలు చేశారని ఆరోపిస్తోంది. చంద్రబాబుతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ5తోనూ రఘురామ సంభాషణలు సాగించినట్లు సీఐడీ అధికారులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం.
ఈ వార్త కూడా చదవండి: ఏపీ వ్యాప్తంగా జనసేన నేతల అరెస్ట్