నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సి ఐ డి కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. మొదట ఎంపీ రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని ఆదేశించింది. ఎంపీ కోలుకునేవరకు ఆసుపత్రిలోనే ఉంచవచ్చని స్పష్టం చేసింది. రఘురామకృష్ణరాజుకు కేంద్రం కల్పించిన వై కేటగిరీ భద్రత కొనసాగించేందుకు సిఐడి కోర్టు అనుమతి ఇచ్చింది. రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. తొలుత జీజీహెచ్ లో, ఆపై రమేశ్ ఆసుపత్రిలో మెడికల్ ఎగ్జామినేషన్ చేపట్టాలని నిర్దేశించింది. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్లో వైద్యం అందిస్తారని తెలిపారు. అయితే రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆయనను జైలుకు తలలించరని న్యాయవాది లక్ష్మి నారాయణ తెలిపారు.