పరేడ్ చేస్తోన్న వారిని వెనుక నుంచి వచ్చి ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటన అమెరికాలోని విస్కిన్ సన్ లో చోటు చేసుకుంది. ఓ ఉన్మాది క్రిస్మస్ పరేడ్ ను టార్గెట్ చేసి కారుతో బీభత్సం సృష్టించాడు. పరేడ్ మీదకు కారు దూసుకువస్తున్న సమయంలో పోలీసులు కారుపై కాల్పులు జరిపారు. ఈ కేసు విచారణలో ఎఫ్‌బీఐ సహకరిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. కాగా ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. పలువురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 20 మంది చిన్నారులు గాయపడినట్లు సమచారం.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. ఎరుపు రంగులో ఉన్న ఓ ఎస్‌యూవీ కారు.. పరేడ్ తీస్తున్నవారిని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. విస్కిన్‌సన్‌లోని వౌకేషా నగరంలో ఈ ఘటన జరిగింది. తాజా ఘటన ఉగ్రవాద ప్రేరేపితం కాదని పోలీసులు వెల్లడించారు. పరేడ్‌లో పాల్గొన్న డ్యాన్స్ టీమ్‌పై కారు దూసుకువెళ్లింది. ఫుల్ స్పీడ్‌లో వచ్చిన కారు.. పరేడ్ దారిలో భయానకం సృష్టించింది. మార్చింగ్ చేస్తున్నవారిపైకి వెళ్లింది. రెడ్ ఎస్‌యూవీని పోలీసులు సీజ్ చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వివరాలను పోలీసులు పూర్తిగా వెల్లడించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..