Tuesday, November 26, 2024

కేరళకు క్రిస్మస్ కిక్కు.. నాలుగు రోజుల్లో 215 కోట్ల మద్యం అమ్మకాలు..

ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా కేరళలో మద్యం అమ్మకాలు రికార్డు కొట్టాయి. మునుపెన్నడూ లేని రీతిలో దాదాపు రూ. 215 కోట్ల మద్యం అమ్మాకాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా కేవలం నాలుగు రోజుల్లో కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (BEVCO) అవుట్‌లెట్‌లు, కన్స్యూమర్‌ఫెడ్ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్మకాలు జోరుగా సాగాయి. క్రిస్మస్ పండుగ రోజున రాష్ట్రంలో ఒక్క బీఈవో ఔట్‌లెట్ల నుంచే రూ.65 కోట్ల మద్యం తాగారు.

రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని పవర్ హౌస్ అవుట్‌లెట్ ఆ రోజు అత్యధికంగా మద్యం విక్రయించి రూ.73 లక్షల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో రాష్ట్రంలో రూ.55 కోట్ల విక్రయాలు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో BEVCO, కన్స్యూమర్-ఫెడ్ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్మకాలు భారీగా జరిగాయి. పవర్ హౌస్ అవుట్‌లెట్ దుకాణంలో అత్యధికంగా రూ.73.54 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి..

కేరళలోని చాలక్కుడిలో అత్యధికంగా రూ.70.7 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. 60 లక్షల మద్యం విక్రయించిన ఇరింజలక్కుడ ఔట్‌లెట్‌ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇదే మూడు ఔట్‌లెట్లు టాప్ ప్లేసులో నిలిచాయి. కన్స్యూమర్ ఫెడ్ అవుట్‌లెట్‌లలో, కొడంగల్లూర్ రూ. 54 లక్షల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉండగా, బెనర్జీ రోడ్, కొచ్చిలోని ఔట్‌లెట్ రూ. 53 లక్షల విలువైన మద్యం విక్రయాలతో రెండో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement