న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డ్నెన్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేశారు. దాంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.నేడు హిప్కిన్స్ తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా ఇక తనలో లేదని జెసిండా తెలిపిన సంగతి విదితమే. ఆమె రాజీనామాను గవర్నర్ జనరల్ సిండీ కిరో ఆమోదించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో హిప్కిన్స్ మంత్రిగా చేశారు. అప్పుడు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు హిప్కిన్స్కు భారీ మద్దతు లభించింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న జనరల్ ఎలక్షన్స్‌లో లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే హిప్కిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం లేబర్ పార్టీకి పాపులారిటీ తగ్గినట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement